భారతదేశం అంతా టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచినందుకు సంబరాలు చేసుకుంటున్న తరుణంలో ప్రస్తుతం టీమ్‌లో స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఎవరూ ఊహించని షాకిచ్చారు. వారి నిర్ణయంతో వాళ్లని ఎంతగానో ఇష్టపడే వారే కాదు, క్రికెట్ అభిమానులు సైతం షాకయ్యారు. ఇంతకీ ఈ స్టార్ క్రికెటర్స్ ఏం చేశారనే వివరాలను చూసేద్దాం…
భారతదేశంలో క్రికెట్ అభిమానులంతా సంబరాలు చేసుకుంటుంటే స్టార్ క్రికెటర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టీ20లకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించి ఎవరూ ఊహించని విధంగా షాకిచ్చారు. ఇది ఎవరూ ఊహించలేదు. అయితే అటు రోహిత్, ఇటు కోహ్లి.. ఇద్దరూ ఒకేసారి టీ20లకు వీడ్కోలు పలకాలని అనుకోవటానికి కారణం.. విజయంతో పలికే ముగింపు గొప్పగా ఉంటుందని భావించటం.. మరో కారణం టీ20ల్లో ఆడటానికి యువ క్రికెటర్స్ చాలా మంది పెవిలియన్‌కే పరిమితం అవుతున్నారు. అలాంటి వారికి జట్టులో చోటు ఇవ్వాలంటే ఇంత కన్నా మంచి తరుణంలో లేదని వారు భావించటమే.
టీ20 ఇండియన్ క్రికెట్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ వర్మ తన కెరీర్‌ను టీ20లతోనే ఆరంభించారు. అక్కడి నుంచి వన్డేలు, టెస్టుల్లోకి ఆరంగేట్రం చేశారు రోహిత్. కెరీర్‌లో టీ20ల విషయానికి వస్తే రోహిత్ 159 మ్యాచ్‌లాడి 32.05 సగటుతో 4231 పరుగులు చేశాడు. అందులో 5 శతకాలున్నాయి. నా కెరీర్‌ను టీ20 ఫార్మేట్‌తోనే ప్రారంభించాను. ఎలాగైనా ఈ టీ20 కప్పును గెలవాలనుకున్నాం.. చివరకు సాధించాం. దీనికి బై బై చెప్పటానికి ఇంత కంటే మంచి సమయం లేదని భావిస్తున్నానని అన్నారు రోహిత్.
కోహ్లి విషయానికి వస్..తే 2010లో జింబాబ్వేపై టీ20 అరంగేట్రం చేశారు. 125 మ్యాచ్‌ల్లో 48.69 సగటుతో 4188 పరుగులు చేశారు. మరీ ముఖ్యంగా ఎంతో కీలకమైన ఫైనల్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ను కోహ్లిని అందుకోవటం విశేషం. చివరి టీ20 ప్రపంచకప్‌ను ఎలా ముగించాలనుకున్నానో అలాగే ముగించటం ఆనందంగా ఉందని కోహ్లి తెలిపారు. ఇకపై వీరిద్దరి ఆటను చూడాలంటే టెస్టులు, వన్డేల్లోనే సాధ్యం.