విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో మరో మూవీ తెరకెక్కనుంది. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ సూపర్ హిట్ కాగా ఇప్పుడు హ్యాట్రిక్ తో అలరించనున్నారు. ఈసారి కేవలం కామెడీయే కాకుండా సీరియస్ యాక్షన్ తో వచ్చేస్తున్నట్టు మూవీ మేకర్స్ తెలిపారు. ఈ మూవీని శిరీష్ నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలు. ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా రామానాయుడు స్టూడియోలో వెంకీ 76 సినిమా షూటింగ్ ను చిత్ర యూనిట్ మొదలు పెట్టింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ మేకింగ్ వీడియోను షేర్ చేసింది. హైదరాబాద్‌లో మీనాక్షి, నరేశ్, వీటీ గణేశ్ తదితరులపై కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. త్వరలోనే వెంకటేష్ సెట్స్ లోకి అడుగుపెట్టనున్నారు. ఈ సినిమాలో వెంకీ మాజీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. హీరో, అతని అందమైన భార్య, మాజీ ప్రియురాలు మధ్య జరిగే ఆసక్తికర కథతో క్రైమ్ ఎంటర్‌టైనర్‌గా సాగనుంది ఈ మూవీ. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ కి భార్యగా నటిస్తుంది. 2025 సంక్రాంతి కానుకగా రానుంది. మరి వెంకీ – అనిల్ హ్యాట్రిక్ కొడతారో లేదో వేచి చూడాలి.