మెగా హీరోల్లో వరుణ్ తేజ్ పరిస్థితేంటో ఎవరూ చెప్పలేని పరిస్థితి!. వరుస ఫ్లాపుల్లోని వరుణ్ ఇప్పుడు పీరియాడిక్ డ్రామాగా ‘మట్కా’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై పెడుతోన్న బడ్జెట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. పరాజయాలు వరుణ్ తేజ్‌ను పలకరిస్తోన్న మట్కాపై నమ్మకంతో నిర్మాతలు హద్దులు దాటి బడ్జెట్‌ను పెడుతున్నారు. మరి నిర్మాతల నమ్మకం నిజమై మూవీ హిట్ అవుతుందా? వరుణ్ తేజ్‌కు ఈ సినిమాతో సక్సెస్ వచ్చేనా? అనే వివరాలను ఇప్పుడు చూద్దాం…
వరుణ్ తేజ్‌కు తప్పకుండా సినిమాల్లో సక్సెస్ అవసరం. ఈ మధ్య ఆయన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డవే. దీంతో ఇప్పుడు చేస్తోన్న మట్కాపైనే ఈ మెగా హీరో నమ్మకం పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ మూడో షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమైంది. పీరియాడిక్ డ్రామాగా ఓ రియలిస్టిక్ ఇన్సిడెంట్ను బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మట్కా మూడో షెడ్యూల్ 35 రోజుల పాటు జరగనుంది. దీని కోసం ఏకంగా రూ.15 కోట్లు ఖర్చు పెట్టి హైదరాబాద్‌లో భారీ సెట్ వేశారు.
వైజాగ్ బ్యాక్ డ్రాప్ మూవీ కావటంతో అలాంటి సెట్‌ను రీ క్రియేట్ చేశారు మేకర్స్. వరుణ్ తేజ్ కూడా తన లుక్‌ను పూర్తి మార్చుకున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో నోరా ఫతేహి కీలక పాత్రలో కనిపించనుంది. కరుణ్ కుమార్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. అయితే వరుణ్ తేజ్‌పై ఇంత బడ్జెట్ అవసరమా!అనే ప్రశ్నలు రాకపోలేదు. అయితే కథపై నమ్మకంతో మట్కా నిర్మాతలు భారీ మొత్తంలో ఖర్చు పెడుతున్నారట.
ఓ సెట్ కోసం పదిహేను కోట్లు ఖర్చు పెట్టారంటే సినిమా అంతా కలిపి ముప్పై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్‌ను దాటుతుందనటంలో సందేహం లేదు. మరి ఈ మొత్తాన్ని వరుణ్ తేజ్ మళ్లీ ఎలా రాబడతారనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది.