త్రిప్తి డిమ్రి.. గతంలో ఎన్నో సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క యానిమల్ సినిమాతో రావడంతో అమ్మడి స్టార్ డమ్ తిరిగిపోయింది. రాత్రికి రాత్రే నేషనల్ క్రష్ గా మారిపోయింది ఈ బ్యూటీ. ఆ తర్వాత కూడా అలాంటి బోల్డ్ పాత్రలే చేస్తూ కుర్రాళ్ల గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ఇటీవల ‘బ్యాడ్ న్యూజ్’ అంటూ విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్ ప్రారంభ రోజులను గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తనకు నటన గురించి ఏం తెలియదన్నారు.
‘నేను చదువులో అంత రాణించలేకపోయాను. దీంతో మోడలింగ్ వైపు రావాలని డిసైడ్ అయ్యాను. ఈ విషయం నా తల్లిదండ్రులకు చెబితే వారు ఒప్పుకోలేదు. అయినా పట్టుదలతో ఆసక్తి ఉన్న వైపే అడుగులు వేసాను. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ఫొటోగ్రఫీ డైరెక్టర్, పాయింట్ ఆఫ్ వ్యూ షాట్ అంటే ఏంటో తెలియదు. అప్పటికి నేను నటనలో కనీసం ఓనమాలు కూడా నేర్చుకోలేదు. విభిన్నంగా ప్రయత్నించాలనుకున్నా. తోటి నటీనటులతో కలిసి ప్రతీ సన్నివేశాన్ని చర్చించేదాన్ని. ఇండస్ట్రీకి వచ్చి సరైన నిర్ణయం తీసుకున్నానా అని ఎన్నోసార్లు ఆలోచించాను. ‘లైలా మజ్ను’ సమయంలో సెట్స్‌లో ప్రతిరోజూ ఏడ్చేదాన్ని. వాళ్లు చెప్పే భాష నాకు అర్థమయ్యేది కాదు. ఇంటికెళ్లి పాత్ర డైలాగులు ప్రాక్టీస్ చేసేదాన్ని’ అంటూ కెరీర్ ప్రారంభ రోజులను గుర్తుచేసుకున్నారు.
యానిమల్ సినిమా తరువాత వరుస అవకాశాలు వచ్చాయి ఈ భామకి. ప్రస్తుతం త్రిప్తి మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. అనీస్ బజ్మీ దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. విద్యాబాలన్, మాధురీదీక్షిత్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఏడాది దీపావళికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. దీనితో పాటు ‘ధడక్ 2’ లోనూ త్రిప్తి కనిపించనున్నారు.