విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ లేటెస్ట్ మూవీ ‘తంగలాన్’కి కొత్త సమస్య వచ్చిపడింది. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ మూవీని పా రంజిత్ తెరకెక్కించారు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కె.ఇ.జ్ఞానవేల్ రాజా దీన్ని నిర్మించారు. మాళవికా మోహనన్, పార్వతీ తిరువోతు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఆగస్ట్ 15న పాన్ ఇండియా రేంజ్‌లో దీన్ని విడుదల చేయటానికి మేకర్స్ రెడీ అయ్యారు. ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. విక్రమ్ తనదైన స్టైల్లో డిఫరెంట్ పాత్రలో మెప్పించటానికి సిద్ధమయ్యారు.
అయితే ఇప్పుడు ‘తంగలాన్’ నిర్మాతకు ఓ కొత్త సమస్య వచ్చి పడింది. అర్జున్ సుందర్‌లాల్ అనే వ్యక్తి కుటుంబీకులు జ్ఞానవేల్ రాజాపై కేసు వేశారు. దీంతో తంగలాన్ రిలీజ్‌కు ముందు ఆయన కోటి రూపాయలు డిపాజిట్ చేయాలని మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో పాటు ఈయన నిర్మిస్తోన్న మరో భారీ చిత్రం కంగువ అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ ముందు కూడా కోటి రూపాయలు డిపాజిట్ చేయాలంటూ కోర్టు చెప్పింది.
అసలేం జరిగిందనే వివరాల్లోకెళ్తే.. జ్ఞానవేల్ రాజా, అర్జున్ దాస్ సుందర్‌లాల్ కలిసి ఓ సినిమా చేయాలనుకున్నారు. నలబై కోట్లు బడ్జెట్ వేసుకున్నారు. ప్రీ ప్రొడక్షన్ సహా ఇతర ఖర్చులకు సుందర్ లాల్ రూ.12.58కోట్లను స్టూడియో గ్రీన్ సంస్థకు ఇచ్చారు. తర్వాత వచ్చిన ఆర్థిక సమస్యల కారణంగా ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ సమయంలో జ్ఞానవేల్ రాజా కేవలం రెండున్నర కోట్ల రూపాయలను మాత్రమే ఇచ్చారు. అర్జున్ దాస్ చనిపోయారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు తమకు రావాల్సిన రూ.10.35 కోట్లతో పాటు దీనికి 18 శాతం వడ్డీని కూడా కలిపి చెల్లించాలని కోరుతూ కోర్టులో కేసు వేశారు.
అయితే దీనిపై స్పందించిన జ్ఞానవేల్ రాజా తాను అర్జున్ దాస్‌తో కలిసి ఎలాంటి సినిమా చేయాలనుకోలేదని, తమిళ సినిమాలకు సంబంధించిన అనువాద హక్కుల కోసం ఆయన తనకు రూ. 12.85 కోట్లు ఇచ్చారని పేర్కొన్నారు.