కోలీవుడ్ విలక్షణ నటుడు సూర్య దసరా సందర్భంగా అక్టోబర్ 10న కంగువ చిత్రంతో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ను రీసెంట్గా రిలీజ్ చేశారు. సూర్య లుక్, సినిమాను తెరకెక్కించిన తీరు అన్నీ ప్రేక్షకులను మెప్పించాయి. ఈ సినిమాను ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 35 భాషల్లో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు తెలుగు నుంచి కూడా సరైన పోటీ లేదని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు అదే రోజున సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రం వేట్టైయాన్ రిలీజ్ కానుంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ దీన్ని నిర్మిస్తోంది.
రెండు భారీ సినిమాలు ఒకేరోజున రిలీజ్ కావటం అనేది సాధారణమైన విషయమే. అయితే సూర్య ఓ విషయంలో డిసప్పాయింట్గా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం.. కంగువతో పాన్ ఇండియా లెవల్లో వెయ్యి కోట్ల క్లబ్ చేరాలనేది ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు రజినీకాంత్ వంటి హీరో పోటీకి వస్తే.. థియేటర్స్ సమస్య వస్తుంది. ఇక్కడే కాదు, ఇది అన్నీ చోట్ల రిపీట్ అవుతుంది. దీంతో కంగువతో సూర్య అనుకున్న లక్ష్యాన్ని రీచ్ కాలేకపోతారనేది అభిమానులు అనుకుంటున్నారు.
వేట్టైయాన్ విషయానికి వస్తే ముందుగా దీన్ని అక్టోబర్ 10నే రిలీజ్ చేయాలనుకున్నారు. మధ్యలో మేకర్స్ సైలెంట్ అయ్యేసరికి సినిమా విడుదల వెనక్కి వెళ్లిందంటూ వార్తలు వినిపించాయి. దీన్ని డిసెంబర్లో విడుదల చేస్తారని కూడా అనుకున్నారందరూ అయితే, ఇప్పుడు అక్టోబర్ 10న రజినీ వచ్చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో రజినీతో పాటు అమితాబ్, రానా వంటి స్టార్స్ కూడా నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. రజినీ వర్సెస్ సూర్యలో విజయం సాధించేదెవరో చూడాలి మరి.