Thursday, September 19, 2024

Latest Posts

దీపావళి బరిలో సత్యదేవ్ ‘జీబ్రా’

కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న క్యారక్టర్ లు చేస్తూ గుర్తింపు తెచ్చుకుని హీరోగా మారాడు యంగ్ హీరో సత్యదేవ్. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, కృష్ణమ్మ, బ్లఫ్ మాస్టర్, వంటి వైవిధ్య భరితమైన సినిమాల్లో నటించి మెప్పించాడు సత్యదేవ్. త్వరలోనే ‘జీబ్రా’ సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రైమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జీబ్రాకు లక్‌ ఫేవర్స్‌ ది బ్రేవ్‌.. అన్నది ట్యాగ్ లైన్. సత్యదేవ్, కన్నడ స్టార్ డాలి ధనుంజయ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా రానుంది. ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మజ ఫిలిమ్స్ బ్యానర్స్ పై SN రెడ్డి, పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. త్యరాజ్, ప్రియా భవాని శంకర్, సత్య, సునీల్, జెన్నిఫర్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ జీబ్రా కు సంగీతాన్ని అందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్, ఈ మోషన్ పోస్టర్ లో నటీ నటులందరినీ చూపించారు.ఈ పోస్టర్ తో సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అంతే కాక ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు మేకర్స్. జీబ్రా సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. నటుడిగానే కాకుండా సహాయ నటుడిగా నటించి మెప్పించారు సత్యదేవ్. నటుడిగానైనా, సహాయ నటుడిగానైనా, ప్రతి నాయకుడిగానైనా తనదైన శైలీలో నటించి ప్రేక్షకులకు దగ్గర అవుతున్నారు సత్య దేవ్. తన విలనిజం ఎలా ఉంటుందో చిరంజీవి కథానాయకుడిగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాతో చూసాం. అక్షయ్ కుమార్ కథానాయకుడిగా వచ్చిన రామసేతు సినిమాలో హనుమంతు పాత్రతో బాలీవుడ్ వారికి దగ్గర అయ్యారు సత్య దేవ్. మరి వైవిధ్యమైన కథలతో అలరించే సత్యదేవ్ మరి జిబ్రా తో ఎలా అలరించనున్నాడో వేచి చూడాలి.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.