Monday, December 23, 2024

Latest Posts

ప్రయోగాత్మక కథాంశంతో సంయుక్త మీనన్!

ఒక సినిమా హిట్ అయితే చాలు నిర్మాతలు అందరు ఆ హీరోయిన్ వెంట పడతారు. ఇక ఆ హీరోయిన్ చేసిన రెండు మూడు సినిమాలు హిట్ అయ్యాయంటే గోల్డెన్ హీరోయిన్ గా ముద్ర వేస్తారు ఆడియెన్స్. అలా అటు ప్రేక్షకులతోను ఇటు నిర్మాతలతో గోల్డెన్ హీరోయిన్ అని పేరు తెచ్చుకుంది ఓ మలయాళీ ముద్దుగుమ్మ. ఆమె ఎవరంటే..సంయుక్త మీనన్.

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ వెండితెరకు పరిచయమైంది కేరళ బ్యూటీ సంయుక్త మీనన్. ఈ సినిమా లో హీరోయిన్ కాకపోయిన రానా కి భార్యగా నటించి మెప్పించింది. తొలి చిత్రానికే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకి ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ సరసన బింబిసార సినిమాతో అలరించింది. తర్వాత వరుసగా సార్, విరూపాక్ష చిత్రాలతో సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు గోల్డోన్ బ్యూటీ, లక్కీ గర్ల్ అంటూ పేర్లు సొంతం చేసుకుంది.

వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంయుక్త మీనన్‌.. తాజాగా ప్రయోగాత్మక కథాంశంతో రూపొందించనున్న లేడీ ఓరియెంటెడ్‌ సినిమా చేయబోతున్నట్లు తెలిపింది. యోగేష్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.నేడు ఈ సినిమాకు సంబందించి పూజ కార్యక్రమాలను రామానాయుడు స్టూడియోలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రానా దగ్గుబాటి రానా హాజరుకానున్నారు. రానాతో పాటుగా మరికొందరు దర్శకులు, నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.

కథలోని కొత్తదనం నచ్చడంతో సంయుక్త మీనన్‌ ఈ సినిమాకు వెంటనే ఓకే చెప్పిందని, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని తెలిసింది. త్వరలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ భామ తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తున్నది.సంయుక్త మీనన్ తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళ భాషలలోనూ సినిమాలు చేస్తుంది. అలాగే ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంది.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.