Monday, December 23, 2024

Latest Posts

నీ డ్యాన్స్ ని ఎవరూ మ్యాచ్ చేయలేరంటూ.. చెర్రీపై సామ్ ప్రశంసలు

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం గేమ్‌ ఛేంజర్‌. చెర్రీ స్క్రీన్ పై కనిపించి దాదాపు రెండేళ్లు అవ్వడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన డైరెక్ట్ గా తెలుగులో సినిమా చేయలేదు. గేమ్‌ ఛేంజర్‌.సినిమాతో తెలుగులో తన డెబ్యూ మూవీ చేస్తున్నారు శంకర్. డెబ్యూ మూవీ కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. తాజాగా గేమ్‌ఛేంజర్‌ సినిమా నుంచి ‘రా మచ్చా మచ్చా..’ అంటూ సాగే రెండో పాటను విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో పాటలో రామ్‌చరణ్‌ డ్యాన్స్‌పై ఉపాసన, సమంతలు ప్రశంసలు కురిపించారు.

రామ్‌చరణ్‌ తన పాటను షేర్‌ చేస్తూ.. ‘ఈ భారీ పాటను నేను ఆనందించినట్లు.. మీరూ ఆనందిస్తున్నారని ఆశిస్తున్నా’ అని రాశారు. ఈ పోస్ట్‌పై రామ్ చరణ్ సతీమణి ఉపాసన స్పందిస్తూ.. మిస్టర్‌ సీ.. మీ డ్యాన్స్‌తో హై ఓల్టేజ్‌ పుట్టించారని రిప్లై ఇచ్చారు. ఇక, స్టార్ హీరోయిన్ సమంత స్పందిస్తూ.. నిన్నెవరూ మ్యాచ్‌ చేయలేరు అంటూ.. ‘అన్‌మ్యాచ్‌బుల్‌’ అని పేర్కొన్నారు. దానికింద ఫార్మల్‌ ప్యాంట్‌, షర్ట్‌ ధరించి ఎవరు ఇలా డ్యాన్స్‌ చేయగలరు.. అంటూ రాసుకొచ్చారు.

రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్‌ఛేంజర్‌’ సినిమాను శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ‘రా మచ్చా మచ్చా’… పాటని సోమవారం విడుదల చేశారు. ఈ పాటకి తమన్‌ స్వరాలు సమకూర్చగా, అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించారు. నకాశ్‌ అజీజ్‌ ఆలపించారు. ఈ సినిమా క్రిస్మస్‌ సందర్భంగా పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌తో కియారా అద్వానీ, అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, జయరామ్‌, నవీన్‌చంద్ర, ప్రకాశ్‌రాజ్‌తో పాటు పలువురు కీలక ప్రాతల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లోఈ చిత్రాన్ని 2024 డిసెంబర్ 20న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.