Monday, December 23, 2024

Latest Posts

ఆసుపత్రి నుంచి సూపర్ స్టార్ డిశ్చార్జ్‌!

సూపర్ స్టార్ రజినీ కాంత్ ఇటీవల అస్వస్థకు గురై చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 30న రజనీకాంత్‌ ఆసుప్రతిలో చేరారు. రజనీకాంత్‌ గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడింది. దీనికి ట్రాన్స్‌కాథెటర్‌ పద్ధతి ద్వారా వైద్యులు చికిత్స అందించారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి. గుండెలో స్టెంట్‌ అమర్చారు. . ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. గురువారం రాత్రి 11 గంటలకు ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.రజనీ ఆసుపత్రిలో చేరినట్లు తెలియగానే అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇప్పుడు ఆయన ఇంటికి చేరుకోవడంతో వారంతా ఆనందంగా ఉన్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన రజనీ.. అభిమానులకు అభివాదం చేస్తూ ఇంటికి వెళ్లారు.

Rajani Kanth
Rajani Kanth

మూడు వారాల తర్వాత షూటింగ్‌కు!

రజనీకాంత్‌ పూర్తిగా కోలుకున్న తర్వాత ‘కూలీ’ షూటింగ్‌లో జాయిన్‌ కానున్నారని కోలీవుడ్‌ మీడియా పేర్కొంది. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌ గా రూపొందుతోంది. ఇందులో కొన్ని యాక్షన్‌ సన్నివేశాలు ఉండడంతో రజనీ పూర్తిగా కోలుకున్న తర్వాత ఈ చిత్రీకరణలో అడుగుపెట్టనున్నారు. మూడు వారాల తర్వాత ఆయన ఈ షూటింగ్‌లో భాగం కానున్నారు. ఈలోపు మిగతా నటీనటులకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో నాగార్జున, శ్రుతిహాసన్‌, సత్యరాజ్‌, ఉపేంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. రజినీకాంత్ వేట్టయాన్ చిత్రంతో అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి జై భీమ్ దర్శకుడు TJ జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించారు . లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై నిర్మాణంలో తెరకెక్కింది. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ ముఖ్య పాత్రలు వహించారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.