Thursday, November 7, 2024

Latest Posts

ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్. ఏమైందంటే?

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. భరించలేని కడుపునొప్పి కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరినట్టు తెలుస్తోంది. సోమవారం రాత్రి ఆయనకు తీవ్రమైన కడుపునొప్పి రాగా .. ఆయనను కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. రజనీని పరీక్షించిన వైద్యులు.. వెంటనే చికిత్స అందిస్తున్నారు. కాగా, ప్రస్తుతం రజనీకాంత్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోందిమరోవైపు రజనీ ఆరోగ్యంపై ఆయన సతీమణి లత స్పందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. దీంతో.. రజనీ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

రజనీకాంత్‌ త్వరలోనే వేట్టయాన్‌, కూలీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. వేట్టయాన్‌ సినిమా విడుదలకు ముందు రజనీ ఇలా అస్వస్థతకు గురి కావడం అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. రజినీకాంత్ వేట్టయాన్ చిత్రంతో అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి జై భీమ్ దర్శకుడు TJ జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించారు . లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై నిర్మాణంలో తెరకెక్కింది. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ ముఖ్య పాత్రలు వహించారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. రజిని వేట్టైయాన్ తో పాటు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న కూలీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున సైమన్ అనే విలన్ పాత్ర పోషిస్తున్నాడు.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.