ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’. సోలోగా ఎన్టీఆర్ నటిస్తోన్న తొలి పాన్ ఇండియా మూవీ కావటంతో అభిమానులు, ప్రేక్షకులే కాదు, ట్రేడ్ వర్గాలు సైతం ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంటోంది.జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మూవీలో తొలి భాగం సెప్టెంబర్ 27న మూవీ రిలీజ్ అవుతుంది. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మంచి క్రేజ్‌తోనే పూర్తవుతుంది. తాజాగా ఈ సినిమాలో రాజమౌళి తనయుడు కార్తికేయ భాగమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అసలు దేవర సినిమాకు కార్తికేయకు లింకేంటి.. అనే సందేహం రావచ్చు. ఆసక్తికరమైన విషయమేమంటే.. రాజమౌళి తనయుడు ఈ మధ్య నిర్మాతగా అవతారం ఎత్తారు. అలాగే సినిమాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను తీసుకుని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ప్రేమలు సినిమాను ఆయన ఇక్కడ రిలీజ్ చేసి సక్సెస్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దేవర సినిమా కర్ణాటక హక్కులను కెవీఎన్ ప్రొడక్షన్‌తో కలిసి కార్తికేయ దక్కించుకున్నారు. రైట్స్ ఎంత మొత్తాన్ని దక్కించుకున్నారనే విషయాన్ని కార్తికేయ రివీల్ చేయలేదు. అయితే సినీ సర్కిల్స్ లో వినిపిస్తోన్న సమాచారం మేరకు రూ.20 కోట్లకు దేవర కర్ణాటక హక్కులను దక్కించుకున్నారు.
రాజమౌళి సినిమాలకు లైన్ ప్రొడ్యూసర్‌గా చేసిన అనుభవంతో నిర్మాతగా మారి షోయింగ్ బిజినెస్ పేరుతో బ్యానర్‌ను స్టార్ట్ చేశారు. రాజమౌళి సమర్పణలో డోంటు ట్రబుల్ ది ట్రబుల్ అనే సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే ఇండస్ట్రీలోని పరిచయాలతో డిస్ట్రిబ్యూటర్‌గానూ మారారు.
For More Updates Visit:
https://arktelugu.com/category/entertainement
https://arktelugu.com/category/gallery
https://arktelugu.com/category/e-paper
Follow US On:
Instagram: https://www.instagram.com/arktvnews/
Facebook: https://www.facebook.com/ArktvEt
Twitter: https://x.com/ArkTelugu
Telegram: https://t.me/arktvnews