టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాక పలు రికార్డులను సృష్టించింది. జాతీయ ఉత్తమ నటుడు అవార్డును బన్నీకి అందించింది పుష్ప సినిమా. ఇక ఈ సినిమా విడుదలైన తరువాత పుష్పరాజ్ మానరిజంతో సోషల్ మీడియా తెగ ట్రెండ్ అయ్యింది. ఎవరి నోటా విన్న పుష్ప తగ్గేదే లే డైలాగులు.. పుష్ప రాజ్ స్టెప్పులే. సినిమా విడుదల అయ్యి 2 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికే ఆ సినిమాకి ఉన్న క్రేజ్ ఏ వేరు. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషించారు. . పుష్ప సినిమాకి కొనసాగింపుగా పుష్ప 2 సినిమా తెరకెక్కుతుంది. రష్మిక మందన పుష్పరాజ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. పుష్ప సినిమాతో అంతర్జాతీయ గుర్తింపు పొందాడు స్టైలిష్ స్టార్. పుష్ప 2 సినిమా కోసం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ తుపాన్‌ని వీక్షించడానికి సిద్ధంగా ఉండాలంటూ ప్రేక్షకులకు పిలుపునిచ్చింది ‘పుష్ప 2’ బృందం. చిత్రానికి సంబంధించిన కొత్త కబురుని పంచుకుంటూ భారతీయ సినీ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయాన్ని వెలిగిస్తాడంటూ పుష్పరాజ్‌పై మరిన్ని అంచనాల్ని పెంచింది. ‘పుష్ప2’ మొదటి సగ భాగం ఎడిటింగ్ పూర్తి చేసుకుని లోడ్ అయిపోయిందని, అంచనాల్ని మించి సినిమా ఉంటుందని చిత్రబృందం స్పష్టం చేసింది. చిత్రం డిసెంబరు 6న విడుదల పక్కా అని పునరుద్ఘాటిస్తూ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాల్ని పేర్కొంది. ‘పుష్ప’ చిత్రానికి కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రం ‘పుష్ప2’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేసుకొంటోంది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.