బీర్ల ఉత్పత్తి కేంద్రాలకు(బ్రూవరీలు) ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలను 10 నుంచి 12 శాతానికి పెంచినట్టు తెలుస్తోంది . దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల ధరలు పెరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రూవరీల నుంచి తయారైన బీరును తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్బీసీఎల్) కొనుగోలు చేసి మద్యం దుకాణాలకు విక్రయిస్తుంది. ఈ మేరకు 12 బీర్ల కేసుకు రూ .289కు బ్రూవరీల నుంచి టీఎస్బీసీఎల్ కొనుగోలు చేస్తుంది. పన్నులన్నీ కలిపి మద్యం దుకాణాలకు రూ.1400లకు విక్రయిస్తుంది. దుకాణ దారులు కేసుకు వినియోగదారుల నుంచి రూ.1800 వసూలు చేస్తారు. బ్రూవరీల వద్ద రూ .24.08గా ఉన్న ఒక్క బీరు వినియోగదారుడి దగ్గరకు వచ్చే సరికి రూ .150గా మారుతుంది.
బ్రూవరీలతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం రెండేళ్ల పాటు అమలులో ఉంటుంది.రెండేళ్లకు ఒకసారి ధరలను సవరిస్తారు. ప్రభుత్వం ప్రతి రెండేళ్లకు బ్రూవరీలకు 10% మేర పెంచుతుంటుంది. చివరిగా 2022లో 6% పెంచగా .. ఇప్పుడు బ్రూవరీలు 20 నుంచి 25% వరకు పెంచమని అభ్యర్ధించారు. ఈ మేరకు పెంచితే వినియోగదారులపై భారం పడుతుందని ప్రభుత్వం 10 నుంచి 12% వరకు పెంచడానికి నిర్ణయిచుకుంది. కొత్త ధరలు వచ్చే నెల నుంచి అమలు అవ్వనున్నాయి .
For More Updates Visit:
https://arktelugu.com/category/entertainement
https://arktelugu.com/category/gallery
https://arktelugu.com/category/e-paper
Follow US On:
Instagram: https://www.instagram.com/arktvnews/
Facebook: https://www.facebook.com/ArktvEt
Twitter: https://x.com/ArkTelugu
Telegram: https://t.me/arktvnews