సౌత్ స్టార్స్ ఇప్పుడు పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీని క్రియేట్ చేశారు. తమకంటూ ఓ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నారు. అలాంటి వారిలో ప్రభాస్, యశ్ ముందు వరుసలో ఉన్నారు. అయితే వీరిద్దరూ రాబోయే చిత్రాలతో ఓ రేసులో నిలబడ్డారు. మరి ఎవరు అందులో విన్నర్ అవుతారనేది ఆసక్తికరమైన విషయమే. ఇంతకీ వీరిద్దరూ పోటీ పడుతున్న విషయమేంటి? అనే ఇంట్రెస్టింగ్ వివరాలు మీకోసం…
సౌత్ సినిమాను పాన్ ఇండియా లెవల్లోనే, పాన్ వరల్డ్ రేంజ్‌కు తీసుకెళ్లటంలో తమ వంతు పాత్రలను పోషించిన కథానాయకులు ప్రభాస్, యశ్. బాహుబలి, కల్కి చిత్రాలతో ప్రభాస్ వసూళ్ల రికార్డులను కొల్లగొడితే.. నేనేం తక్కువ తిన్నానా అంటూ కెజియఫ్1, కెజియఫ్2 చిత్రాలతో తన సత్తా చాటారు యశ్. వీరిద్దరి బాటలో ఇప్పుడు చరణ్, తారక్ సహా పలువురు హీరోలు పరుగులు తీస్తున్నారు. అయితే ఈ పరుగు కారణమైన ప్రభాస్, యశ్ ఇప్పుడు తమకు తెలియకుండానే మరో పరుగు పందెంలో నిలిచారు. ఇంతకీ వీరిద్దరూ పోటీ పడుతున్న అసలు విషయం ఏంటో పాన్ ఇండియా హ్యాట్రిక్ హిట్ కొట్టెదెవరో! అనే విషయంలో.
వివరాల్లోకెళ్తే.. ముందుగా ప్రభాస్ విషయానికి వస్తే బాహుబలి1, బాహుబలి 2 తర్వాత ప్రభాస్ స్పీడుకి బ్రేకులు పడ్డాయి. ఫెయిల్యూర్స్‌ని చవిచూశారు. అయితే ఆయన తన ప్రయత్నాలను మాత్రం మానలేదు. బాలీవుడ్ నిర్మాతలు కూడా ప్రభాస్‌తో సినిమాలు చేయటానికి రెడీ అయ్యారు. అయితే రీసెంట్ టైమ్‌లో సలార్, కల్కి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర జోరుని చూపించాయి. మంచి కలెక్షన్స్ వచ్చాయి. కల్కి అయితే మరోసారి ప్రభాస్ వెయ్యి కోట్ల హీరోగా నిలబెట్టింది. దీంతో ఆయనలో, ఆయన ఫ్యాన్స్ ఉత్సాహం తొణికిసలాడుతోంది.
ఇక యశ్ విషయానికి వస్తే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈయన కథానాయకుడిగా నటించిన కెజియఫ్ 1, కెజియఫ్ 2 చిత్రాలు సెన్సేషన్ క్రియేట్ చేశారు. కెజియఫ్ 2 అయితే ఏకంగా రూ.1200 కోట్లను వసూలు చేసింది. దీని తర్వాత నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలంటే ఏకంగా రెండున్నరేళ్ల సమయాన్ని తీసుకున్నారు యశ్. ఇప్పుడు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో టాక్సిక్ సినిమాను చేయటానికి యశ్ సిద్ధమయ్యారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. ఇది హిట్ అయితే యశ్‌కు హ్యాట్రిక్ మూవీ అవుతుంది. దీంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అదే రోజున.. అంటే ఏప్రిల్ 10నే ప్రభాస్ కూడా రాజాసాబ్ సినిమా రానుంది. ఈ సినిమా హిట్టయితే ప్రభాస్ హ్యాట్రిక్ హిట్ కొట్టేసినట్లే. అంటే ఇద్దరు పాన్ ఇండియా హీరోలు హ్యాట్రిక్ హిట్ రేసులో నిలబడ్డారు. అది కూడా ఒకే రోజున కావటం విశేషం. మరి ఇద్దరిలో ఎవరు విజేతగా నిలుస్తారు.. ఎవరు వెనుకడుగు వేస్తారనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.