ఈ ఏడాది జూన్ 27న రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా బాక్సాఫీస్ దగ్గర రికార్డులను కల్కి చిత్రంతో షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అందరి దృష్టి ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ది రాజా సాబ్’పై ఉంది. రీసెంట్‌గా విడుదలైన వీడియో గ్లింప్స్ సినిమాపై మంచి అంచనాలను పెంచింది. అందులో ప్రభాస్ చాలా యంగ్ లుక్‌లోకనిపిస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అలాగే ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించేశారు. అదే రోజున కన్నడ రాక్ స్టార్ యష్ పోటీలో ఉన్నారు. ఆ సంగతిని పక్కన పెడితే కెరీర్ పరంగా ఏప్రిల్ ప్రభాస్‌కు మిశ్రమ ఫలితాలను అందించింది. అభిమానుల్లో ఈ విషయం కాస్త కంగారుని కలిగిస్తోన్న మాట వాస్తవమే.
ప్రభాస్ కెరీర్‌ను పరిశీలిస్తే ఆయన్ని పాన్ ఇండియా హీరోగా నిలబెట్టిన బాహుబలి 2, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్ చిత్రాలు ఏప్రిల్ నెలలోనే రిలీజ్ అయ్యాయి. అలాగే మున్నా, పౌర్ణమి, బిల్లా చిత్రాలు విడుదలయ్యాయి. ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదనే సంగతి తెలిసిందే. ఇలా ఏప్రిల్ నెల ప్రభాస్‌కు మిక్స్‌డ్ రిజల్ట్స్‌ను ఇచ్చినవే. ఈసారి ఏప్రిల్ నెలలో ది రాజా సాబ్‌తో రాబోతున్నారు ప్రభాస్. హారర్ రొమాంటిక్ కామెడీ జోనర్‌తో మెప్పించనున్నారు బాక్సాఫీస్ డార్లింగ్ ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.
ది రాజా సాబ్ సినిమాను మారుతి డైరెక్ట్ చేయగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తే… రిద్ది కుమార్ కీ రోల్‌లో మెప్పించనున్నారు. అలాగే కోలీవుడ్ కమెడియన్ యోగిబాబు తెలుగులోకి పరిచయం అవుతున్నారు.
For More Updates Visit:
https://arktelugu.com/category/entertainement
https://arktelugu.com/category/gallery
https://arktelugu.com/category/e-paper
Follow US On:
Instagram: https://www.instagram.com/arktvnews/
Facebook: https://www.facebook.com/ArktvEt
Twitter: https://x.com/ArkTelugu
Telegram: https://t.me/arktvnews