ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అంటే పూజా హెగ్డే అని అందరూ టక్కున చెప్పేస్తారు. ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చి.. దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించింది. మహేష్ బాబుతో మహర్షి, ప్రభాస్‌తో రాధేశ్యామ్, ఎన్టీఆర్ సరసన అరవింద సమేత, అల్లు అర్జున్‌తో అలా వైకుంఠపురం సినిమాల్లో నటించి భారీ విజయాలను అందుకుంది ఈ భామ. అలా టాప్ లో ఓ వెలుగు వెలిగిన ఈ భామకి కొన్నాళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో ఆఫర్లు కనుమరుగైంది. ఆమె నటించిన రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్ వంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. వరుస ప్లాపులతో ఉన్న పూజాకి తెలుగులో శ్రీలీలకి డిమాండ్ పెరగడంతో టాలీవుడ్ పూర్తిగా పక్కన పెట్టేసింది. అంతేకాదు గుంటూరు కారం సినిమా నుంచి గురూజీ కూడా బుట్టబొమ్మను తప్పించగా.. తెలుగులో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది పూజా హెగ్డేకు.
తాజాగా పూజా హెగ్డేకి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. పూజా హెగ్డే వరుస ఫ్లాపులు ఆమెకు ఎదురైనా ఏమాత్రం అధైర్యపడకుండా కెరీర్‌లో విజయం కోసం ప్రయత్నాలు చేస్తుంది. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఆఖరి చిత్రంలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా అయినా తనకి పూర్వ వైభవాన్ని అందిస్తుందని ఆశతో ఉంది పూజా.
గతంలో మిగతా హీరోయిన్లతో పోలిస్తే భారీ పారితోషకాన్ని అనుడుకొనేది ఈ భామ. ప్రస్తుతం కాస్త రెమ్యూనరేషన్ తగ్గించిందని తెలుస్తోంది. దళపతి విజయ్ సినిమాకు రెమ్యునరేషన్ భారీగా తగ్గించి తీసుకుందని తెలిపింది. ప్రస్తుతం పూజాహెగ్డేకు తమిళం, హిందీల్లో అవకాశాలు బాగానే వస్తున్నా.. తెలుగులో మాత్రం ఇప్పటి వరకు కొత్త సినిమాకు సైన్ చేయలేదు. తమిళంలో సూర్య 44 చిత్రంలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా ఖరారు అయ్యింది. ఈ రెండు చిత్రాలు ఘన విజయాన్ని సాధించి , తెలుగులో కూడా మంచి అవకాశాలు వస్తాయన్న నమ్మకంతో ఉంది పూజాహెగ్డే. ఇది ఇలా ఉంటే పూజా హెగ్డే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ సీరియల్ నటుడు బిగ్ బాస్ ఫేమ్ రోహన్ మెహ్రాతో పూజా హెగ్డే ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఈ మధ్య ఆమె తన బాయ్‌ఫ్రెండ్ రోహన్‌తో తరచూ తిరుగుతూ ఉంటుంది. పూజా హెగ్డే చాలాసార్లు కెమెరాకు చిక్కింది.