Thursday, September 19, 2024

Latest Posts

ఆ స్టార్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ తమిళ డెబ్యూ మూవీ?

టాలీవుడ్ లో అగ్ర హీరో ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘దేవర’. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ నుండీ రాబోతున్న సినిమా ఇదే కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘అరవింద సమేత’తర్వాత అంటే దాదాపు 6 ఏళ్ళ తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ నటించిన చిత్రం ‘దేవర’. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సెప్టెంబర్ 27న ఈ పాన్ ఇండియా సినిమాని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. విడుదల సమయం దగ్గర అవ్వడంతో ప్రమోషన్స్ తో బిజీగా ఉంది చిత్ర బృందం. ఈ నేపథ్యంలో ఎన్టీయార్ దేవర ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో ఓ ఈవెంట్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తారక్ తమిళ స్ట్రయిట్ సినిమా పై యాంకర్ ప్రశించగా తారక్ మాట్లాడుతూ ‘ వెట్రిమారన్ త్వరగా నాతో సినిమా చేస్తే తెలుగులో డబ్బింగ్ చేసుకుంటాను’ అని అన్నాడు. వాస్తవానికి వెట్రిమారన్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎప్పుడో నటించాల్సి ఉంది. తారక్ కు కథ వినిపించడం కూడా జరిగింది. కాని ఈ చిత్రం పట్టాలెక్కలేదు.

RRR అనుకున్న టైమ్ కు రిలీజ్ కాకపోవడంతో వెట్రిమారన్ ఇతర సినిమాలతో బిజీగా ఉన్నాడు. కానీ విశ్వసనీయ సమాచారం మేరకు యంగ్ టైగర్ హీరోగా, వెట్రిమారన్ దర్శకత్వంలో సినిమా తప్పకుండా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మరొక హీరోకు కూడా అవకాశం ఉందని ఆ రోల్ కోసం తమిళ నటుడు ధనుష్ ను అనుకున్నారని సమాచారం. ఈ బ్లాక్ బస్టర్ కాంబోలో రానున్న సినిమా KGF ( కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) నేపథ్యంలో సాగుతుందని టాక్. ఈ భారీ బడ్జెట్ సినిమాను తమిళ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించనుందట. వెట్రిమారన్ సినిమాల్లో అనవసరపు కమర్షియల్ ఎలిమెంట్స్ వంటివి ఉండవు , అలాగే తారక్ నుండి ఏ విధమైన మాస్ అయితే కోరుకుంటారో అవన్నీ ఉండేలా ఈ సినిమాను తెరకెక్కిస్తారట. అన్ని అనుకున్నట్టు జరిగితే త్వరలో ఈ సినిమా వుండే అవకాశం ఉంది. మరో వైపు వార్ -2 తో బాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ లో నటిస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీయార్. ఇదే కాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు తారక్.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.