జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా వచ్చిన దేవర సూపర్ హిట్ తో దూసుకుపోతుంది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించి ఇప్పుడు వచ్చే వసూళ్లు అన్ని లాభాలే అని డిస్ట్రిబ్యూటర్స్ నిన్నే వెల్లడించారు. దసరా సెలవులు కావడం.. చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు ఏమి లేకపోవడతో ఈ సినిమా మేకర్స్ ఇంకా లాభాల పంటే అని చెప్పవచ్చు.
తారక్ సినిమా ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలను ఫ్యామిలీ విషయాల గురించి చాలా తక్కువగా మాట్లాడుతుంటారు ఎన్టీఆర్. ‘దేవర’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల లాస్ ఏంజెలిస్ వెళ్లినతెలిసిందే . అక్కడ ఆయన తన తనయులు అభయ్, భార్గవ్ గురించి మీడియాతో మాట్లాడారు. వాళ్లిద్దరి మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని చెప్పారు. పిల్లలను భవిష్యత్తులో సినీ పరిశ్రమలోకి తీసుకువస్తారా? అనే ప్రశ్న తారక్ కు ఎదురు అవ్వగా.. ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
‘నాకు నచ్చిందే వారిని చేయమనడం , నా ఇష్టాయిష్టాలను వారిపై రుద్దడం నాకు నచ్చదు. అలా నేను చేయను. ప్రస్తుత కాలంలో పిల్లలు వారి సొంత ఆలోచనలు కలిగి ఉండాలని నేను కచ్చితంగా నమ్ముతా. వారు ఏం చేయాలనుకుంటున్నారో వారే స్వతహాగా నిర్ణయించుకునే వాతావరణాన్ని మనం కల్పించాలి. ఇది చెయ్.. అది చెయ్ అని అడ్డంకులు చెప్పకూడదు. వాళ్లిద్దరి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. సినిమాల్లోకి అడుగుపెట్టు.. యాక్టింగ్‌లోనే రాణించాలి అని వాళ్లను బలవంతం చేయను. ఎందుకంటే నా తల్లిదండ్రులు నన్ను ఆవిధంగా ప్రోత్సహించలేదు. ఏదో సాధించాలనుకుంటున్నాడు చేయని అనే విధంగా ప్రోత్సహించారు. అదే విధంగా నా పిల్లల అభిప్రాయాలను నేనూ గౌరవించాలనుకుంటున్నా. నా వృత్తి గురించి నా పిల్లలకు తెలుసు. తండ్రిని నటుడిగా చూసినప్పుడు.. ఆ బాటలోనే అడుగులు వేయాలని కుమారులు కూడా కోరుకుంటారు. ఇది సహజంగా జరుగుతుంది’ అని ఎన్టీఆర్ చెప్పారు.
ఇదే ఇంటర్వ్యూలో ‘దేవర: పార్ట్ 2’ ఎప్పుడు మొదలవుతుందన్న ప్రశ్నకు బదులిచ్చారు. ‘‘దేవర 1’ షూటింగ్ సమయంలోనే పార్ట్2లోని కొన్ని సన్నివేశాలు షూట్ చేశాం. దేవర పార్ట్ 1 హిట్ అవ్వడంతో మాపై మరింత బాధ్యత పెరిగింది. మొదటి భాగం కంటే సీక్వెల్ ఇంకా
బాగుంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కథ సిద్ధమైంది. ‘దేవర’ కోసం కొరటాల శివ ఎంతో కష్టపడ్డారు. అందుకే ఆయన్ని ఓ నెలన్నర పాటు విశ్రాంతి తీసుకోమని చెప్పా. ఆయన మళ్లీ హాలీడే నుంచి తిరిగొచ్చాక రెండో భాగం పనులు ప్రారంభిస్తాం’ అని చెప్పారు.
For More Updates Visit:
https://arktelugu.com/category/entertainement
https://arktelugu.com/category/gallery
https://arktelugu.com/category/e-paper
Follow US On:
Instagram: https://www.instagram.com/arktvnews/
Facebook: https://www.facebook.com/ArktvEt
Twitter: https://x.com/ArkTelugu
Telegram: https://t.me/arktvnews