నేచురల్ స్టార్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘సరిపోదా శనివారం’. నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. భారీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆగష్టు 29న ప్రేక్షకులకు అందించడానికి చిత్ర బృందం సిద్ధం అయింది.
కాగా, ఆగష్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా యూసఫ్ గూడ ఫస్ట్ బెటాలియన్ పోలీసులతో సందడి చేశారు నాని. పోలీసుల అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలో ఓ పోలీస్ యువతకు డ్రగ్స్ గురించి అవగాహన కల్పించాలని కోరారు. దీనికి సమాధానమిస్తూ నాని.. ‘చాలా మంది డ్రగ్స్ చెడు.. డ్రగ్స్ వల్ల యువత పాడైపోతారని చెప్పడమే తప్ప.. దాంతో వచ్చే సమస్యలు ఏమిటో ఎవ్వరూ చెప్పట్లేదు. అసలు వాటితో వచ్చే సమస్యలు ఏంటో తెలియకపోతో, అవి ఎందుకు చెడో అర్ధం కాదు. చాలా మంది పిల్లలు, యువత డ్రగ్స్ అంటే ఏంటో తెలుసుకోవడానికి మొదట తీసుకుని తరువాత బానిస అయిపోతున్నారు. కానీ అది వాస్తవానికి మనశ్శాంతిగా ఉండే మన జీవితంలో ఒకసారి దానికి అలవాటు అయితే వాటిని తీసుకోకుండా ఏ పని చేయలేని పరిస్థితికి డ్రగ్స్ తీసుకెళ్తాయి. చాలా మంది తెలియక డ్రగ్స్ తీసుకుంటే ఎదో జాయ్ ఫీలింగ్ వస్తది అని అనుకుంటారు.. కానీ అవి మీ జాయ్ ని, ఆనందాలను డ్రగ్స్ హరిస్తాయి. సినిమాలలో చూపించే విధంగా పార్టీలు చేసుకొనే విధంగా డ్రగ్స్ ఉండవని.. డ్రగ్స్ అంటే పాయిజన్’ అని నాని తెలిపారు. అంతే కాకుండా ఎవరైనా డ్రగ్స్ చెడు.. డ్రగ్స్ మంచిది కాదు అనే కాక అవి ఏ రకంగా హాని కలిగిస్తాయో వివరించాలని సూచించారు.\