నేచురల్ స్టార్ నాని ఇటీవల వరుస హిట్లతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాని తన నటనతో నేచురల్ స్టార్ గా గుర్తింపు పొందాడు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన దసరా సినిమా ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో తెలిసిన విషయమే. ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేసి ఘన విజయం సాధించింది. అంతేకాక సైమా, ఐఫా అవార్డులలోనూ ఈ సినిమా సత్తా చాటింది. దసరా భారీ విజయం కావడంతో నాని – శ్రీకాంత్ ఓదెల కాంబోలో ఓ పెద్ద ప్రాజెక్ట్ రానుందని ప్రకటించారు. రెండో సారి వీరి కాంబోలో రానున్న సినిమా పలు రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన దసరా సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిన విషయమే. సైమా, ఐఫా అవార్డులను కూడా ఈ సినిమా సొంతం చేసుకుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నాని కెరీర్‌లో ఇది 33వ సినిమా. ఈ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది.
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న రెండో సినిమాను ఈనెల 12న దసరా సందర్భంగా లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్లో సాగే కథతో తెరకెక్కనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, అనిరుధ్ ఇదివరకే నాని గ్యాంగ్ లీడర్, జెర్సీ సినిమాలకు హిట్ ఆల్బమ్స్ అందించాడు. అయితే, ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే, అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. గతంలో ఈ సినిమా గురించి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల స్పందిస్తూ.. #NaniOdela2తో దసరా సినిమాకి వచ్చిన హైప్ ను 100 రెట్లు సృష్టిస్తానని మాట ఇస్తున్నాను’ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం నాని శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్’ ఫ్రాంచైజీలో భాగంగా తెరకెక్కనున్న ‘హిట్: ది థర్డ్ కేస్’ లో నటిస్తున్నాడు.