టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. స్టార్ హీరోల సినిమాల్లోనూ సహాయ పాత్రలు చేయడమే కాక కొత్త నటులకు అవకాశమిస్తూ వాళ్ల సినిమాలలోనూ కీలక పాత్రలు చేస్తారు నాగ్. ఇక ఆయన సోలో హీరోగా నటించిన సినిమాలలో చాలా సినిమాలు హిట్ సాధించినప్పటికీ కలెక్షన్ల పరంగా నిరాశపరుస్తున్నాయి. సోగ్గాడే చిన్నినాయన , ఊపిరి సినిమాల తర్వాత ఆ రేంజ్ లో షేర్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమా లేదనే చెప్పాలి. బంగార్రాజు , నా సామిరంగ సినిమాలు విజయాన్ని అందుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా అంతటి విజయాన్ని అందుకోలేదన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం నాగ్ పారితోషికం 12 నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా నాగ్ తన పారితోషికాన్ని దాదాపుగా డబుల్ చేశారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
రజినీ కాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘కూలీ’. ఈ సినిమాలో కింగ్ నాగార్జున నటిస్తున్నట్లు మూవీ మేకర్స్ ఆయన పుట్టిన రోజు సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసి ప్రకటించారు. కాగా, ఈ సినిమాకు నాగ్ పారితోషికం ఏకంగా 24 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ కావడంతో నాగ్ ఈ రేంజ్ లో డిమాండ్ చేసినట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. చాలామంది మిడిల్ రేంజ్ హీరోలతో పోల్చి చూస్తే నాగ్ రెమ్యునరేషన్ ఎక్కువ కావడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
కూలీ మూవీ సక్సెస్ సాధిస్తే నాగ్ ఇదే తరహా పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ధనుష్ హీరోగా రానున్న కుబేర సినిమాలో కూడా నాగార్జున నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నాగ్ 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ ను అందుకున్నారని తెలుస్తోంది. నాగార్జునకు ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉంది. కూలీ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ సినిమా 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది. నాగార్జున సోలో హీరోగా కంటే ఇతర ప్రాజెక్ట్ లతో బిజీ అవుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. కూలీ సినిమా బిజినెస్ పరంగా కూడా సంచలనాలు సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాగార్జున తన రేంజ్ ను అంతకంతకూ పెంచుకుంటూ విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.