మెగా ఫ్యామిలీ హీరోలు మంచి జోష్ మీదున్నారు. సినిమాల విషయానికి వస్తే మెగా హీరోలు ఇప్పుడు ఆస్కార్ విన్నర్స్‌తో వర్క్ చేస్తుండటం విశేషం. ఇంతకీ ఆస్కార్స్ విన్నర్స్‌తో పని చేస్తోన్న మెగా హీరోలెవరు..ఏంటా సినిమాలు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మెగా ఫ్యామిలీలో దాదాపు పదిమంది హీరోలున్నారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ టాప్ ప్లేస్‌లో ఉంటారు. క్రేజ్, ఇమేజ్ పరంగా వీరు అగ్ర కథానాయకులుగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురు ఆస్కార్ విన్నర్స్‌తో వర్క్ చేస్తున్నారు. ఇంతకీ ఏ సినిమాలతో అనే వివరాల్లోకెళ్తే.. ముందుగా మెగాస్టార్ చిరంజీవి విషయానికి విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. ఈయన మూడు సినిమాలు చేస్తున్నారు. అందులో హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకు కూడా ఎం.ఎం.కీరవాణియే మ్యూజిక్ చేస్తుండటం విశేషం. ఈ సినిమా ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఈ ఏడాది డిసెంబర్‌లో హరిహర వీరమల్లు సినిమా విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విషయానికి వస్తే.. ట్రిపులార్ తర్వాత రామ్ చరణ్, శంకర్ కాంబోలో గేమ్ చేంజర్ సినిమా తెరకెక్కుతోంది. దీని తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నారు. దీనికి ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. మరి ఏ సినిమా ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటుందో చూడాలి మరి.