మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ ఏడాది మార్చి లో ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. మానుషి చిల్లర్ కథానాయికగా నటించింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలను అందుకోలేకపోయింది. దీంతో మట్కా సినిమాను ఎంతో ప్రతిష్టాత్మికంగా చేస్తున్నాడు వరుణ్. ఈ సినిమాకు కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
‘మట్కా’ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో కీలకమైన సన్నివేశాల్ని రూపొందిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని సినీ వర్గాలు తెలిపాయి. వరుణ్‌తేజ్ సరసన కథానాయికలు మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి నటిస్తున్నారు. వైరా ఎంటర్ టైన్మెంట్ మరియు SRT ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లపై విజేందర్‌రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన సంగతుల్ని త్వరలోనే బయట పెడతామని సినీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. పీరియాడిక్ కథతో రూపొందుతున్న చిత్రమిది. కొన్ని దశాబ్దాల కిందటి వాతావరణాన్ని తలపించేలా ప్రత్యేకమైన సెట్స్‌ని తీర్చిదిద్ది, ఆ నేపథ్యంలో షూటింగ్ చేస్తున్నారు. ఒకవైపు షూటింగ్ జరుపుతూనే, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేస్తున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. నవీన్‌చంద్ర, సలోని, అజయ్ ఘోష్, కన్నడ కిశోర్, రవీంద్ర విజయ్, పి.రవిశంకర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు.