తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా త్వరలో రానున్న చిత్రం వేట్టాయాన్. జై భీమ్ వంటి సూపర్ సక్సెస్ అందుకున్న టీ.జె. జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లేక ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. రజనీకాంత్ హీరోగా ఈ సంస్థ నిర్మించిన నాలుగవచిత్రంగా ఈ సినిమా రానుంది. రజనీకాంత్ సరసన మంజు వారియర్ హీరోయిన్గా నటిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 10న వేట్టాయాన్ ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి మేకర్స్ కసరత్తులు చేస్తున్నారు.
సినిమా విడుదల సమయం దగ్గర కావడంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచి వారియర్ ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తొలిసారి రజనీతో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇప్పటివరకూ నేను తమిళంలో పలు సినిమాలోనాలో యాక్ట్ చేశాను. గతేడాది ‘తునివు’తో ప్రేక్షకులను అలరించా. దర్శకుడు హెచ్.వినోద్ ‘తునివు’ స్క్రిప్ట్ వివరించినపుడు అందులో హీరోగా ఎవరు నటిస్తున్నారో నాకు తెలియదు. ప్రాజెక్ట్ ఓకే చేసిన తర్వాత హీరోగా అజిత్ నటిస్తున్నారని చెప్పారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ‘వేట్టయాన్’కూ అలాగే జరిగింది. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ‘జై భీమ్’ నాకెంతో నచ్చింది. ఆయన సినిమాలో అవకాశం వస్తే చేయాలి అనుకున్నా. అలాంటి సమయంలో ఆయన ‘వేట్టయాన్’ స్క్రిప్ట్‌తో నన్ను సంప్రదించారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తున్నారని చెప్పినప్పుడు నేను షాకయ్యా’ అని మంజు వారియర్ తెలిపారు.
ఆ తర్వాత ఆమె ‘మనసిలాయో’ గురించి మాట్లాడుతూ.. ‘‘మా పాట ఇంత పెద్ద హిట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. నా కెరీర్లో ఇలాంటి సూపర్ హిట్ అందుకున్న పాట ఇదే. మలయాళంలో చాలా పాటలు చేసినప్పటికీ ఇంత క్రేజ్ రాలేదు. ప్రేక్షకులు ‘మనసిలాయో’ను బాగా ఆదరిస్తున్నారు. డ్యాన్స్ మూమెంట్స్ కూడా సింపుల్‌గా ఉంటాయి’ అని ఆమె చెప్పారు.