కోలీవుడ్ హీరో విక్రమ్ హీరోగా వస్తోన్న చిత్రం తంగలాన్. పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా రానుంది. మాళవిక మోహనన్ తంగలాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలోని ఓ ఆసక్తికర సన్నివేశం గురించి నటి మాళవిక మోహనన్ ఇంటర్వ్యూలో చెప్పారు.
‘ఒకరోజు షూటింగ్ కి రెడీ అయ్యి వెళ్లేసరికి అక్కడ ఒక పెద్ద గేదె ఉంది. రంజిత్ సార్ దాని పైకి ఎక్కగలవా? అని అడిగారు. ఎదో సరదాగా అంటున్నారు అనుకున్నా. కానీ ఆయన మేకప్ పూర్తి అయ్యాక దాని మీద కూర్చో … ఆ సన్నివేశాన్ని చిత్రీకరించాలి అని చెప్పారు. దీని గురించి నాకు ముందు చెప్పలేదు.. దీంతో ఆశ్ఛర్యపోయా’ అని చెప్పింది.
నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. పార్వతి తిరువోతు, పశుపతి, డేనియల్ కాల్టాగిరోన్, సంపత్ రామ్, హరి కృష్ణన్ కీలక పాత్రలు పోషించారు. జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు. విభిన్న కథతో ఆగష్టు 15న ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది.
Follow us on:
Instagram: https://www.instagram.com/arktvnews/
Facebook: https://www.facebook.com/ArktvEt
Twitter: https://x.com/ArkTelugu
Telegram: https://t.me/arktvnews