సూపర్‌స్టార్ మహేష్, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో SSMB 29 రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మహేష్ కూడా తన లుక్‌ను పూర్తిగా మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. అత్యవసరం అయితే తప్ప బయట కనిపించటం లేదు. రాజమౌళితో సినిమా అంటే కనీసం రెండు, మూడేళ్ల సమయం పడుతుంది. అప్పటి వరకు ఫ్యాన్స్, ప్రేక్షకులు వెయిట్ చేయాల్సిందే. మహేష్‌ను సిల్వర్ స్క్రీన్‌పై చూడలేమని బాధపడే ఆయన ఫ్యాన్స్‌కి మరో రూపంలో బాధను తీర్చబోతున్నారట మహేష్.
వివరాల్లోకి వెళితే, 2019లో విడుదలైన యానిమేటెడ్ మూవీ ది లయన్ కింగ్ భారీ విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ముఫాసా సినిమాను మేకర్స్ రూపొందించారు. డిసెంబర్ 20న ఈ చిత్రంలో హాలీవుడ్ సహా మన దేశంలోనూ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ ప్రాజెక్ట్‌పై క్రేజ్‌ను పెంచటానికి మేకర్స్ ఇప్పటి నుంచే భారీగా ప్లానింగ్ చేసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా బాలీవుడ్‌లో ముఫాసా పాత్రకు షారూక్ ఖాన్‌తో డబ్బింగ్ చెప్పించారు. ఇక టాలీవుడ్‌లో మహేష్ ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పబోతున్నారు.
త్వరలోనే ముఫాసా సినిమాకు సంబంధించి మహేష్ డబ్బింగ్ మొదలు కానుంది. హాలీవుడ్ మూవీ కోసం అది కూడా పిల్లలకు కనెక్ట్ అయ్యే సినిమా కోసం మహేష్ రంగంలోకి దిగటం విశేషం. ఇలా డబ్బింగ్ చెప్పటానికి మహేష్ భారీ మొత్తాన్నే రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నారని సినీ సర్కిల్స్ అంటున్నాయి.