‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ వద్ద సంచనాలు సృష్టిస్తోనే ఉంది.. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.750 కోట్లు వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే ప్రభాస్ నెక్స్ట్ మూవీ ‘స్పిరిట్’ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. యానిమల్ ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. భూషణ్ కుమార్‌కు చెందిన టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
అయితే ఇప్పుడు ఈ మూవీ గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. అది ఏంటంటే దక్షిణ కొరియా సూపర్ స్టార్ మా డాంగ్-సియోక్‌ను ఈ మూవీలో విలన్ రోల్ లో టాలీవుడ్ కి పరిచయం చేయనున్నారు అంట.
15 ఏళ్ల తన కెరీర్ లో మా డాంగ్-సియోక్ దాదాపు 50 సినిమాలు చేశారు. కొరియన్ చలనచిత్ర పరిశ్రమలో ఆయనను డాన్ లీ అని పిలుస్తారు. ‘ట్రైన్ టు బుసన్’, ‘డిరైల్డ్’, ‘ది అవుట్‌లాస్’, ‘ది బ్యాడ్ గైస్: రీన్ ఆఫ్ ఖోస్’ మరియు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ‘ఎటర్నల్స్’ వంటి సినిమాలలో నటించారు.
అయితే దీని గురించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కె-పాప్, కె-డ్రామాకు ఇప్పుడున్న పాపులారిటీ చూసి ఈ మూవీలో డాంగ్-సియోక్‌ని చేర్చాలని మూవీ మేకర్స్ యోచిస్తున్నారంట. ఈ మూవీలో ప్రభాస్ సరసన రష్మిక నటిస్తోందనే వార్తలు వచ్చాయి.
గతంలో ప్రభాస్ ఈ మూవీ గురించి మాట్లాడుతూ.. ‘ఇది నా 25వ సినిమా. స్పిరిట్ కథ చాలా బాగుంది మరియు ఇది నా అభిమానులకు ప్రత్యేక చిత్రం అవుతుంది. సందీప్ రెడ్డి వంగా అందరికీ డ్రీమ్ డైరెక్టర్ ఆయనతో కలిసి ఈ సినిమాలో నటించడం నాకు పెద్ద అవకాశం’ అని అన్నారు. ఈ సినిమా తొలిరోజు 150 కోట్ల వసూళ్లు రాబడుతుందని సందీప్ రెడ్డి ప్రకటించారు. ఈ మూవీ షూటింగ్ 2024 చివరిలో ప్రారంభం అవుతుందని సమాచారం.చిత్ర యూనిట్ దీన్ని 2025 చివరిలో లేదా 2026 తొలి నెలల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.