Saturday, December 21, 2024

Latest Posts

సలార్ 2 నుంచి క్రేజీ లీక్స్.. ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్

గ్లోబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ బాహుబలి సినిమా తరువాత అమాంతం పెరిగిపోయింది. బాహుబలి అన్నీ పాన్ ఇండియా లెవెల్ సినిమాలే చేస్తున్నాడు ప్రభాస్. ఆదిపురుష్, రాధే శ్యామ్ అనుకున్నంత విజయం సాధించినప్పటికీ సలార్ సినిమాతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు రెబల్ స్టార్. ఇటీవల నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే ఉత్సాహంతో చాలా సినిమాలను ప్రభాస్ లైన్లో పెట్టారు. ప్రస్తుతం ‘స్పిరిట్’, ‘కల్కీ 2’, ‘రాజా సాబ్’, ‘సలార్ 2’ వంటి సినిమాలతో పాటు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ‘ఫౌజీ’ మూవీలో కూడా నటిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో బిజీ గా ఉన్నాడు. ప్రభాస్ రాజాసాబ్ , ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 చిత్రాలు పూర్తి చేయాల్సి ఉంది. దీంతో ‘సలార్ 2’ షూటింగ్ పట్టాలెక్కడానికి కాస్త సమయం పట్టేలా ఉంది.

హీరో ప్రభాస్, కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘సలార్’. స్నేహం కథాంశంతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద రూ.700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.భారీ విజయాన్ని సాధించిన ఈ చిత్రానికి సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటో చూసేద్దాం..

ప్రభాస్, ప్రశాంత్ నీల్ మధ్య చెడిందని అందుకే ‘సలార్ 2’ ప్రాజెక్ట్ రద్దు అయ్యిందని జోరుగా ప్రచారం జరిగింది. ఈ పుకార్లపై నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ స్పందించింది. సెట్స్‌లో ప్రభాస్-ప్రశాంత్ నీల్ నవ్వుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. నవ్వకుండా ఉండలేరని పరోక్షంగా పుకార్లను కొట్టిపారేసింది.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.