కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ కేసు ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.. కేవలం ఇండస్ట్రీలోనే కాదు.. పొలిటికల్ సర్కిల్‌లోనూ హాట్ టాపిక్‌గా మారిందీ. లైంగిక ఆరోపణలు ఎదుర్కుంటున్న జానీ మాస్టర్ ని సైబరాబాద్ పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం గోల్కొండలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో ఆయనకీ వైద్య పరీక్షలు జరుగుతున్నాయి.వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత పోలీసులు అతడ్ని ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశ పెట్టారు. జానీ మాస్టర్‌కు కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది. అయితే ఈ క్రమంలో జానీ మాస్టర్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఉప్పరపల్లి కోర్ట్ దగ్గరకు వచ్చిన జానీ మాస్టర్ మీడియాతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది.
తాను ఏ తప్పు చేయలేదని ఎవ్వరినీ వేధించలేదని, తనను కావాలనే ఇందులో ఇరికించారని వాపోయారు. ఇదంతా చేస్తున్న వదిలి పెట్టనని అన్నాడు. కోర్టులో న్యాయపరంగా పోరాడి.. నిజాయితీగా తిరిగి వస్తానని అన్నాడు. జానీ మాస్టర్‌కు కోర్టు రిమాండ్ విధించగా.. ఆయన్ను చంచల్ గూడ జైలుకి తరలించనున్నట్టుగా తెలుస్తోంది
రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో జానీ మాస్టర్ వద్ద పనిచేసిన ఓ మహిళా అసిస్టెంట్ ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పుడు అత్యాచారం చేసి వేధించినందుకు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న జానీ మాస్టర్‌ను గోవాలో ప్రత్యేక బృందంతో పోలీసులు పట్టుకున్నారు. గురువారం పోలీసులు జానీని హైదరాబాద్ తరలించారు. ఈరోజు వైద్య పరీక్షలు నిర్వహించి ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది.