[ad_1]
Published on Jul 3, 2024 7:00 PM IST
మన టాలీవుడ్ లెజెండరీ నటుడు మెగాస్టార్ చిరంజీవి తెర మీదనే కాకుండా తేవ వెంక కూడా రియల్ హీరో అని అందరికీ తెలుసు. ఇన్నేళ్ల సినీ ప్రస్థానంలో చిరు అలాగే తమ కుటుంబ సభ్యులు కూడా ఎన్నో సహాయాలు ఎందరికో తెలుగు ఇండస్ట్రీలో అందించారు. అలా ఇప్పుడు మెగా కుటుంబం తరపున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే తన భార్య ఉపాసన లు కలిసి మరో మెగా సాయాన్ని చేసినట్టుగా పాన్ ఇండియా స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ద్వారా తెలిసింది.
అయితే రీసెంట్ గానే జానీ మాస్టర్ తన పుట్టినరోజుని మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లతో కలిసి జరుపుకున్నట్టుగా బయటకి వచ్చింది. మరి అసలు ఈ కలయిక వెనుక ఉన్న అసలు కారణాన్ని జానీ మాస్టర్ ఇప్పుడు రివీల్ చేశారు. తన పుట్టినరోజుని గుర్తు పెట్టుకొని చిరంజీవి గారు, చరణ్ గారు ఇంటికి పిలిపించడం ఎంతో ఆనందాన్ని ఇస్తే అక్కడ నాకు ఎప్పుడో ఇచ్చిన మాట ప్రకారం టాలీవుడ్ లో ఉన్న డాన్సర్స్ యూనియన్ సభ్యులు అందరికీ కూడా భీమా కల్పిస్తామని చెప్పడం ఆ ఆనందాన్ని 1000 రెట్లు ఎక్కువ చేసింది అని జానీ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు.
“అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని, ఇచ్చిన మాటకి విలువనిస్తూ, అన్ని కుటుంబాలని చేరదీయడం మామూలు విషయం కాదు. మా అందరి మనసులో కృతజ్ఞత భావం ఎల్లకాలం ఉంటుంది. మా అందరి తరపు నుండి అన్న, వదినలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీలాంటి వారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను” అని జానీ మాస్టర్ చివరి మాటలు తెలుపుతూ తాను చరణ్ అలాగే ఉపాసన కలిసి ఉన్న పిక్ ని షేర్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు. దీనితో మెగా ఫ్యామిలీ చేసిన ఈ మరో సాయం అభిమానులను మరింత ఆనందానికి లోను చేసింది.
సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు ????
నా పుట్టినరోజు సందర్భంగా @AlwaysRamCharan అన్న ఇంటికి పిలిచినపుడు వారికి నా మీదున్న ప్రేమకి చాలా సంతోషపడ్డా.
అక్కడికి వెళ్ళాక మెగాస్టార్ @KChiruTweets గారి ఆశీర్వాదం తో పాటు చరణ్ అన్న @upasanakonidela వదిన నాకు ఇచ్చిన మాటకి నా సంతోషం 1000… pic.twitter.com/BSgp2oih0G
— Jani Master (@AlwaysJani) July 3, 2024
[ad_2]