[ad_1]
Published on Jul 4, 2024 5:32 PM IST
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898ఎడి. జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులని, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ప్రభాస్ కెరీర్ లో మరో మైలురాయిగా ఈ చిత్రం నిలిచింది.
ఈ చిత్రం నుండి హోప్ ఆఫ్ శంబాల అనే సాంగ్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేయడం జరిగింది. సినిమాలో ఎంతో కీలకం అయిన ఈ సాంగ్ ను రిలీజ్ చేయడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీపికా పదుకునే, దిశా పటాని, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.
[ad_2]