డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ కలయికలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలుసు. ఈ చిత్రం పూరీ జగన్నాథ్ కెరీర్ లో వచ్చిన కష్టాలను అధిగమించేలా చేయడమే కాక హీరో రామ్ మార్కెట్ ను రెండింతలు పెంచింది. ఆ సినిమా తర్వాత ఇద్దరికీ హిట్టు పడలేదు. రామ్ యావరేజ్ సినిమాలతో నెట్టుకొస్తున్నాడు. పూరీ జగన్నాథ్ అయితే ‘లైగర్’ తో పెద్ద డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. భారీ నష్టాలను మిగిల్చింది.డిస్ట్రిబ్యూటర్లు పూరీ పై ఒత్తిడి చేయడం మనకు తెలిసిన విషయమే.
విజయ్ దేవరకొండతో మొదలుపెట్టిన ‘జె జిఎం'(జన గణ మన) కూడా ఆగిపోయింది. ఇక అటు రామ్ కి ఇటు పూరికి సూపర్ హిట్ కావాలి. ఆ కసితోనే ‘డబుల్ ఇస్మార్ట్’ ను పూర్తి చేశారు. ఇది ‘ఇస్మార్ట్ శంకర్’ కి కొనసాగింపుగా రానుంది. ఆగస్టు 15న ఈ సినిమాప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ వంటివి సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పుతున్నాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ ను కూడా పూర్తి చేసుకుంది.
‘డబుల్ ఇస్మార్ట్’ ను వీక్షించిన తర్వాత సెన్సార్ వారు ఈ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్ ను జారీ చేశారు. సినిమా చాలా బాగుందని చెప్పారట. పూరీ జగన్నాథ్, రామ్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని వారు భరోసా ఇచ్చారట. అలాగే సంజయ్ దత్, రామ్ పాత్రల మధ్య వచ్చే మైండ్ గేమ్ సినిమాకు హైలెట్ అని చెప్పినట్టు తెలుస్తోంది. టెక్నికల్ గా కూడా ‘డబుల్ ఇస్మార్ట్’ చాలా రిచ్ గా ఉందని వారు చెప్పడం గమనార్హం.
For More Updates Visit:
https://arktelugu.com/category/entertainement
https://arktelugu.com/category/gallery
https://arktelugu.com/category/e-paper
Follow US On:
Instagram: https://www.instagram.com/arktvnews/
Facebook: https://www.facebook.com/ArktvEt
Twitter: https://x.com/ArkTelugu
Telegram: https://t.me/arktvnews