Thursday, September 19, 2024

Latest Posts

వరుస సినిమాలకు స్టార్ హీరో గ్రీన్ సిగ్నల్.. దర్శకుడు ఆయనే..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇటీవల రాయన్ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఈ చిత్రానికి తానూ నటిస్తూనే స్వయంగా దర్శకత్వం వహించారు ధనుష్. రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది రాయన్. ఇదే మాదిరిగా ఆయన నటిస్తూ దర్శకత్వం వహించిన మరో సినిమా NEEK (నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్) త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ సినిమాలోనూ ఆయన నటిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే.. తాను దర్శకత్వం వహించిన రాయన్ చిత్రం భారీ విజయం అందుకోవడంతో వరుస సినిమాలకు దర్శకత్వం వహించడానికి ఆసక్తి చూపుతున్నాడు ధనుష్. ధనుష్ దర్శకత్వం వహించే మరో సినిమాలో హీరోగా తమిళ సీనియర్ నటుడు విజయ్ కుమార్ కొడుకు, యంగ్ హీరో అరుణ్ విజయ్ నటించనున్నాడని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

వరుస సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తన కెరీర్ లో 52వ సినిమాగా రానుంది. ఈ చిత్రానికి కూడా తానే దర్శకత్వం వహించడం విశేషం. ఈ సినిమాను ఆకాష్ బాస్కరన్ డాన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ మేరకు ఒక పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘డాన్ పిక్చర్స్ మా మొదటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రకటించడానికి సంతోషిస్తున్నాము, ఇది ప్రొడక్షన్ హౌస్‌కి ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించడానికి వినూత్నమైన కంటెంట్‌ను రూపొందించడానికి సిద్ధంగా ఉన్నాము. మా తోలి ప్రాజెక్ట్ ధనుష్ సర్ నటించిన ‘నడిపిన్ అసురన్’ “D52″ని ప్రకటించడం గర్వంగా ఉంది. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మేము ధనుష్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము’ అని నిర్మాత ఆకాష్ భాస్కరన్ తెలిపారు.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.