Thursday, September 19, 2024

Latest Posts

గూస్ బంప్స్ తెప్పించే ‘దేవర’ ట్రైలర్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ నటించిన మోస్ట్‌ అవైయిటెడ్‌ మూవీ ‘దేవర’. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో జాన్వీ కపూర్ తారక్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. దేవర తోనే జాన్వీ తెలుగు తెరకు పరిచయం కానుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. తారక్ స్క్రీన్ పై కనిపించి దాదాపు రెండేళ్లు అవ్వడంతో ఈ సినిమాపై అటు అభిమానుల్లోనూ ఇటు సినీ ప్రియుల్లోనూ భారీ అంచనాలే నెలకొన్నాయి. కాగా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న దేవర మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలోని మూడు లిరికల్ సాంగ్స్ మిలీయన్ వ్యూస్ రాబటట్టి సెన్సేషన్ సృష్టిస్తున్నాయి.

తాజాగా చిత్ర బృందం దేవర ట్రైలర్ ను విడుదల చేసింది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే రిలీజ్ అవుతున్న ప్రమోషనల్ కంటెంట్ హైప్ మరింత ఎక్కించేలానే ఉంది. ‘దేవర’ ట్రైలర్ చూస్తే అభిమానులకు గూస్ బంప్స్ రావడం గ్యారంటీ. ‘ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం’ విడుదలైన తర్వాత నుంచి తమ అభిమాన కథానాయకుడి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నఅభిమానులకు దర్శకుడు కొరటాల శివ ఒక్క ట్రైలర్ ద్వారా వారు ఎదురుచూపులకు బ్రేక్ వేశాడని చెప్పవచ్చు. ట్రైలర్‌లో ఇంత చూపించారంటే… ఇక సినిమాలో ఇంకెంత ఉంటుందో ఊహించుకోండి.

‘ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్ని ఎక్కువ చూసుండాది. అందుకే ఏమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు’ – ‘దేవర’ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ చెప్పిన మాట. ఆ నెత్తురి వేట, ఎన్టీఆర్ కత్తి వేటు ఎలా ఉంటుందో చూపించారు కొరటాల శివ. మరీ ముఖ్యంగా మూడు నిమిషాల దృశ్యాల్లో యాక్షన్ సన్నివేశాలు హైలైట్ అయ్యాయి. ‘దేవర’గా ఎన్టీఆర్ చేసే యాక్షన్ అదిరింది. దేవర గురించి ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగులు బావున్నాయి. సంభాషణల్లో కొరటాల శివ మార్క్ కనిపించింది. ట్రైలర్ చివరిలో షార్క్ మీద ఎన్టీఆర్ చేసే సవారీ హైలైట్ అంతే.ఈ సినిమాని యువసుధా ఆర్ట్స్ బ్యానర్ మీద సుధాకర్ మిక్కిలినేనితో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ట్రైలర్ ను చాలా ఆసక్తికరంగా కట్ చేశాడు డైరెక్టర్. సినిమాలో ఉన్న ఇంటెన్స్ మొత్తాన్ని ట్రైలర్ ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రెండు భిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నట్లు ట్రైలర్ ద్వారానే క్లారిటీ ఇచ్చేశారు.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.