మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ మూవీ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదలైన అయిన ట్రైలర్‌కు కూడా సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. ట్రైలర్‌తో అది నెక్స్ట్ లెవల్‌కు వెళ్లిపోయింది. ‘దేవర’ రన్ టైమ్ లాక్ అయింది. సెన్సార్ పూర్తి చేసుకున్న దేవర రన్‌టైమ్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎక్కువ రన్టైమ్తోనే వస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో అసలు ‘దేవర’ రన్‌టైమ్ ఎంత? సెన్సార్ విశేషాలు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
‘దేవర’ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ చిత్రం నిడివి 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లుగా ఉంది. దాదాపుగా మూడు గంటల రన్‌టైమ్ ఉండనుంది. మూడు గంటలు అంటే తారక్-కొరటాల రిస్క్ చేస్తున్నారా? అంతసేపు ఆడియెన్స్‌ను సీట్లకు కట్టిపడేయాలంటే మూవీ నెక్స్ట్ లెవల్లో ఉంటే తప్పిస్తే అంత సేపు సహనం వహించలేరు. అయితే సాధారణంగా పెద్ద సినిమాలు కాస్త ఎక్కువ నిడివితోనే వస్తుంటాయి. వాటితో చూస్తే ‘దేవర’ రన్‌టైమ్ కామన్ అనిపిస్తుంది.
సినిమా కనెక్ట్ అయితే రన్‌టైమ్ పెద్ద సమస్య కాదనే చెప్పాలి. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ లాంటి మూవీస్ భారీ రన్టైమ్తోనూ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. చిత్రం బాగుంటే ఎంత ఎక్కువ సేపు ఉన్నా ఇంకా చూడాలనే అనిపిస్తుంది. అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. కాబట్టి యాక్టింగ్‌తో తారక్.. కథ, కథనం, మేకింగ్‌తో కొరటాల కట్టిపడేస్తే ‘దేవర’కు రన్‌టైమ్ బిగ్ ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఇప్పటికే తారక్ ఈ సినిమా చివరి 45 నిమిషాలు వేరే లెవెల్ ఉంటుందని చెప్పడంతో నిడివి ఎక్కువున్న సినిమా సూపర్ హిట్ అవుతోంది అంటున్నారు ఆయన అభిమానులు. దేవర కు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. తాజాగా విడుదలైన ట్రైలర్ఒ.. ఒక్క రోజులో అన్ని భాషల్లో కలుపుకొని 55 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది.