Monday, December 23, 2024

Latest Posts

ఈ దసరాకు థియేటర్‌లో సందడే సందడి.. మరి ఓటీటీలో..?

పండుగ అంటేనే సినిమా. ఏదైనా పండుగ వస్తే చాలు కుటుంబంతో కలిసి సినిమా చూడడానికి ఇష్టపడతారు. సినీ ప్రియులు. మరి ఈ వరం దసరా పండగకు వెండితెరపై సందడి నెలకొంది. తెలుగు సినిమాలతో పాటు పలు డబ్బింగ్‌ మూవీలూ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. పండుగ వాతావరణంలో ఇక స్క్రీన్ పై చూడడానికి కుదరని వారు ఓటీటీలో కుటుంబంతో కలిసి చూడడానికి ఆసక్తి చూపిస్తారు. మరి థియేటర్లోనూ, ఓటీటీలోనూ అలరించే చిత్రాలు/సిరీస్‌లు ఏంటో చూసేద్దాం రండి..

ఈ వారం థియేటర్లో అలరించే సినిమాలివే!

వేట్టయాన్‌

‘జైలర్‌’ విజయం తర్వాత రజనీ నటిస్తున్న మరో యాక్షన్‌ డ్రామా చిత్రం ‘వేట్టయాన్‌’. ‘జై భీమ్‌’ వంటి సోషల్‌ మెసేజ్‌ మూవీతో ప్రేక్షకులను అలరించిన టి.జె.జ్ఞానవేల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబరు 10న విడుదల కానుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది.

విశ్వం

గోపీచంద్‌ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రానున్న చిత్రం విశ్వం. టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబరు 11న విడుదలవుతోంది.

మార్టిన్‌’

సరా బరిలో ‘మార్టిన్‌’తో అలరించనున్నారు ధ్రువ సర్జా. ఆయన హీరోగా నటించిన ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని ఎ.పి.అర్జున్‌ తెరకెక్కించారు. ఈ సినిమా అక్టోబరు 11న విడుదల కానుంది.

జిగ్రా

అలియా భట్, వేదాంగ్‌ రైనా ప్రధాన పాత్రల్లో వాసన్‌ బాలా తెరకెక్కించిన చిత్రం ‘జిగ్రా’. ధర్మ ప్రొడక్షన్స్, వయాకామ్‌ 18 స్టూడియోస్, ఎటర్నల్‌ షైన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు నిర్మించాయి. ఇది అక్టోబరు 11న థియేటర్లలోకి రానుంది.

మా నాన్న సూపర్‌ హీరో’

సుధీర్‌ బాబు కథానాయకుడిగా అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మా నాన్న సూపర్‌ హీరో’. ఆర్ణ కథానాయిక. షాయాజీ షిండే కీలక పాత్రలో కనిపించనున్నారు. దసరా కానుకగా అక్టోబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

జనక అయితే గనక

ఈ దసరాకి ‘జనక అయితే గనక’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు నటుడు సుహాస్‌. సంకీర్తన కథానాయక. ఈ చిత్రాన్ని దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. సందీప్‌ బండ్ల దర్శకత్వం వహించారు. అక్టోబరు 12న ఈ మూవీ విడుదల కానుంది.

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే చిత్రాలు/సిరీస్‌లివే!

నెట్‌ఫ్లిక్స్‌

యంగ్‌ షెల్డన్‌ (ఇంగ్లీష్‌) అక్టోబరు 8
మాన్‌స్టర్‌ హై 2 (ఇంగ్లీష్‌) అక్టోబరు 10
ఖేల్‌ ఖేల్‌ మే (హిందీ) అక్టోబరు 9
స్టార్టింగ్‌ 5 (వెబ్‌ సిరీస్‌) అక్టోబరు 10
టోంబ్‌ రైడర్‌: లారా క్రాఫ్ట్ (యానిమేషన్‌) అక్టోబరు 10
లోన్లీ ప్లానెట్‌ (ఇంగ్లీష్‌) అక్టోబరు 10
ఔటర్‌ బ్యాంక్స్‌4 (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 10
అప్‌ రైజింగ్‌ (కొరియన్‌ సిరీస్‌) అక్టోబరు 11
ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ (టాక్‌ షో) అక్టోబరు 12
చుక్కీ (ఇంగ్లీష్‌) అక్టోబరు 15

డిస్నీ+హాట్‌స్టార్‌

సర్ఫిరా (హిందీ) అక్టోబరు 11
వారై (తమిళ) అక్టోబరు 11

ఈటీవీ విన్‌

పైలం పిలగా (తెలుగు) అక్టోబరు 10
తత్వ (తెలుగు) అక్టోబరు10

జియో సినిమా

గుటర్‌ గూ (హిందీ) అక్టోబరు 11
టీకప్‌ (హాలీవుడ్‌) అక్టోబరు 11

సోనీలివ్‌

జై మహేంద్రన్‌ (మలయాళం) అక్టోబరు 11
రాత్‌ జవాన్‌ హై (హిందీ) అక్టోబరు 11

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.