ఖాజాగూడ చిత్రపురి కమిటి పైన సైబరాబాద్ ఏకనామిక్ అఫెన్స్ వింగ్ లో మూడు FIR లు నమోదు అయ్యాయి. సైబరాబాద్ డీసీపీ 46/2024, 47/2024, 52/2024 కింద FIRలు నమోదు చేశారు.ప్రస్తుత కమిటీ, పాత కమిటి మొత్తం కలిపి 21 మంది పైన నాన్ బెయిలబుల్ సెక్షన్ 120B కింద కేసు నమోదు అయింది. కాగా, వీరిలో టీవీ9 యాంకర్ దీప్తి వాజ్‌పేయి ఉండడం గమనార్హం. ఆమెతో పాటు ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పై కూడా కేసు నమోదు చేశారు.
అనిల్ కుమార్ వల్లభనేని, ప్రవీణ్ యాదవ్, సత్యనారాయణ దొర, లలిత టి, అళహరి వివి ప్రసాద్, కొంగర రామకృష్ణ, అనిత నిమ్మగడ్డ, రఘు బత్తుల, కాదంబరి కిరణ్, మహానంద రెడ్డి, వినోద్ బాలా, జెల్లా మధుసూదన్, PS. కృష్ణ మోహన్ రెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు, కె.రాజేశ్వర రెడ్డి, చంద్ర మధు, దేవినేని బ్రహ్మానంద రావు, కొల్లి రామకృష్ణ,కె.ఉదయ భాస్కరరావు లపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
చిత్రపురిలో ఫ్లాట్ల కోసం సొసైటీకి డబ్బులు కట్టి మోసపోయిన బాధితులు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. విచారణలో సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ అక్రమాలు తేలడంతో గత నెలలో ఆయన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును సీరియ్‌సగా తీసుకున్న పోలీసులు ఇప్పుడు వీరిపై కేసు నమోదు చేశారు.