సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. స్టార్ హీరోలందరి సినిమాలు సంక్రాంతికే విడుదల చేయాలనుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ కూడా 2025 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారంట. 2023 సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్ బాస్టర్ అందుకున్న మెగాస్టార్.. ఇప్పుడు విశ్వంభరకు అదే సెంటిమెంట్ రిపీట్ చేయాలనుకుంటున్నారు.
మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘విశ్వంభర’ యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్‌ని సంక్రాంతి కానుకగా 2025, జనవరి 10న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. ప్రకటించిన తేదీకే రిలీజ్ చేయాలని చిత్ర నిర్మాణం శరవేగంగా సాగుతోంది.
ఈ మూవీకి సంబంధించి మెగా అభిమానులకు మూవీ టీం గుడ్ న్యూస్ తెలిపింది. పూజ కార్యక్రమంలో డబ్బింగ్ వర్క్ మొదలైనట్లు పేర్కొంది. ఈరోజు దీనికి సంబందించిన పనులు ప్రారంభమయ్యాయని.. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని తెలిపింది. ఈ మూవీ దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారని సమాచారం. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు టాక్. సోషియో ఫాంటసీ మూవీ కావడంతో వీఎఫ్‌ఎక్స్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే త్రిష, ఆషికా పేర్లను అధికారికంగా ప్రకటించారు. ఇంక త్వరలోనే సురభి, ఇషా చావ్లా, మీనాక్షి చౌదరి పేర్లను మూవీ మేకర్స్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. జెడ్ స్పీడ్‌తో ఈ సినిమా పనులు జరగడం చూస్తుంటే సంక్రాంతి బరిలో కచ్చితంగా నిలుస్తుందనే చెప్పవచ్చు. మరి ఈ సినిమాతో మెగాస్టార్ టాలీవుడ్ దగ్గర ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.