దేవర.. కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీని మాత్రమే కాదు.. మొత్తం ఇండియాను ఊపేస్తున్న పేరు ఇది. కల్కి తర్వాత విడుదలైన అతి పెద్ద సినిమా. RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ సోలోగా వచ్చిన చిత్రమే దేవర. 2018లో అరవింద సమేత సినిమాతో స్క్రీన్ పై కనిపించిన యంగ్ టైగర్ నిన్న మళ్లీ దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంటే దాదాపు ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ బొమ్మ థియేటర్లో పడింది. కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆచార్య వంటి డిజాస్టర్స్ చవి చూసిన కొరటాల ఈ సినిమాని పలు జాగ్రత్తలు తీసుకొని మరి తెరకెక్కించాడు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్ వెండితెరకు పరిచయం అయ్యింది. ఎన్నో అంచనాల మధ్య నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయినా ఈ సినిమా పై వస్తున్న కామెంట్స్ చూసేద్దాం..
ఒక ఊహాజనిత ప్రాంతాన్ని సృష్టించి తన కథకు కావాల్సిన ఎత్తుగడను చాలా ఆసక్తికరంగా ఎంచుకున్నాడు కొరటాల శివ. ఈ మధ్యకాలంలో బాగా వర్క్ అవుట్ అవుతున్న ఎలివేషన్ ఫార్ములాని నమ్ముకున్నట్లే అనిపించింది. 90 దశకంలో ప్రారంభమయ్యే ఈ కథలో ప్రేక్షకుడు లీనం కావడానికి ఎంతో సమయం పట్టదు. సముద్రం నేపథ్యం అభిమానులకే కాదు, సగటు ప్రేక్షకుడికీ గొప్ప థియేట్రికల్ అనుభూతిని పంచుతుంది. ఆయుధాల కోసం ఊళ్లో దేవర, భైర మధ్య సాగే భీకర పోరు తదితర సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఫియర్ సాంగ్‌తో పాటు వచ్చే పోరాట ఘట్టాలు, ఇంటర్వెల్ సీన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. అనిరుద్ మ్యూజిక్ సినిమాకే హైలైట్ గా నిలిచిందని చెప్పవచ్చు. ఎప్పటిలాగే ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంతో అదరగొట్టాడు. విలన్ గా సైఫ్ అలీ ఖాన్ తన పాత్రకు న్యాయం చేశాడు. ఎన్టీఆర్ సరసన జాన్వీ నిడివి తక్కువగా ఉన్న.. ఉన్నంతసేపు పర్వాలేదనిపించింది. ఇక ముఖ్య పాత్రలలో నటించిన ప్రకాష్ రాజ్, కళయరసన్, షేన్ చాం టాకో, శ్రీకాంత్, శృతి మరాఠీ, మురళీ శర్మ, అభిమన్యు సింగ్ వంటి వాళ్ళు తమ నటనతో ఆకట్టుకున్నారు.
ఫస్ట్ ఆఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఫీలింగ్కలుగుతుంది. కానీ క్లైమాక్స్ విషయంలో మాత్రం సినిమా రెండవ పార్ట్ కోసం వదిలిన లీడ్ ఆసక్తి రేకెత్తించేలా ఉందని కొందరు అంటే .. బాహుబలి మాదిరిగా ఉందని మరికొందరు అంటున్నారు. ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన జాన్వీ పాత్ర కూడా కొద్దిసేపు ఉందని, దావూదీ పాట సినిమాలో లేకపోవడం నిరాశ వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ద్విపాత్రాభినయంలో ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉంది.. కానీ ఆయన వేషధారణ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. కంప్యూటర్ గ్రాఫిక్స్ కోసం మరింత సమయం కేటాయిచి ఉంటే బాగుండేది అనిపిస్తుండి