[ad_1]
Published on Jul 4, 2024 6:05 PM IST
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్ లోని 109వ సినిమాను ‘NBK109’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ ప్రాజెక్టులను కూడా బాలయ్య ఓకే చేశారు.
ఈ జాబితాలో మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘అఖండ’కు సీక్వెల్ గా ‘అఖండ-2’ ని తెరకెక్కించనున్నాడు. అయితే, ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి తాజాగా ఓ వార్త సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అఖండ-2 చిత్ర షూటింగ్ ఆగస్టు నెల తరువాతే ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో అందాల భామ ప్రగ్యా జైస్వాల్ మరోసారి అలరించనుంది. కాగా, మిగతా నటీనటులు, టెక్నీషియన్ల ఎంపిక ఏమీ జరగలేదని.. అందుకే ఈ చిత్ర షూటింగ్ ఆలస్యం కానుందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్టు వర్క్ నడుస్తుందట. కాగా, ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు అఫీషియల్ గా రావాల్సి ఉంది.
[ad_2]