Wednesday, December 25, 2024

Latest Posts

హాలీవుడ్ సినిమాను తలపించేలా దేవర: అనిరుధ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన సినిమా దేవర. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఇక దేవర ఆగమనానికి సర్వం సిద్ధమయ్యింది. ఈరోజు అర్ధరాత్రి నుంచి ప్రీమియర్ షోలు రానున్న వేళ అభిమానులు థియేటర్లను హంగురంగులతో ఏర్పాటు చేస్తున్నారు.

దాదాపు ఆరేళ్ల తర్వాత తారక్ సోలోగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక థియేటర్ల వద్ద తమ అభిమాన హీరో కటౌట్లను భారీ ఎత్తున ఏర్పాటు చేశారు అభిమానులు. సెప్టెంబర్ ప్రారంభం నుంచి దేవర గురించి వరుస అప్డేట్లు తెలుపుతూ సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేశారు మూవీ మేకర్స్. జైలర్ వంటి సూపర్ హిట్ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసిన అనిరుద్.. దేవర సినిమాకి సంగీతాన్ని అందించాడు..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిరుద్ దేవర సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘దేవర’ మూవీ హాలీవుడ్ సినిమాను మరిపిస్తుందని అన్నాడు. హైదరాబాద్ లో ఫ్యాన్స్ తో కలిసి ఈ మూవీ చూడాలని ఉందని ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ‘ఇంత గొప్ప సినిమాను ఎలా రూపొందించారా అని ఆశ్చర్యమేస్తోంది. ఈ మూవీ చూసేటప్పుడు అవెంజర్స్, బ్యాట్ మ్యాన్ సినిమాలు చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో యాక్షన్, సెంటిమెంట్, డ్రామా అన్నీ ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు. కాగా, ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాలో మ్యూజిక్ హైలైట్ గా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు.

ప్రస్తుతం ఈ చిత్ర బుకింగ్స్ ఊహించిన దానికంటే ఎక్కువగా జరుగుతున్నాయి. దేవర సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోయిందని, స్పెషల్‌గా సెకండాఫ్‌లో టెర్రిఫిక్‌గా ఉండబోతుందని ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గ్గట్టుగానే దేవర బుకింగ్స్ ముఖ్యంగా నైజాం సేల్స్ భారీ స్థాయిలో ఉన్నాయి. అటు ఆంధ్రాలో, కర్ణాటక దేవర బుకింగ్స్ కనీవినీ ఎరుగని రీతిలో సాగుతున్నాయి.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.